కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు తొలగించిన సింగరేణి

కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు తొలగించిన సింగరేణి
  • ఆందోళనలో  రిటైర్డ్ కార్మికులు, కుటుంబీకులు.. 

బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తీ, కన్నాల బస్తీ సింగరేణి కాలనీల్లో కార్మికులు, రిటైర్డ్ కార్మికులు నివాసముంటున్న క్వార్టర్లకు సింగరేణి యాజమాన్యం విద్యుత్ కనెక్షన్లను తొలగించింది. మందమర్రి జీఎం దేవేందర్ ఆదేశాల మేరకు సోమవారం ఈ చర్యలు చేపట్టారు.  కార్మికులకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ కనెక్షన్లను తొలగించడం పట్ల కార్మికులు, కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యతో రెండు బస్తీల క్వార్టర్లు చీకటిలో మునిగిపోయాయి.  తమకు విద్యుత్ కనెక్షన్లు తిరిగి అందించాలని, సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.